నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత... 

నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత... 

–రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు


ఖమ్మం బ్యూరో , అక్టోబర్-09(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం నగరంలో ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్ బాలాజీనగర్‌లో సుడా నిధులు రూ. 90 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో రోడ్ల విస్తరణ పనులను ప్రజలను ఒప్పిస్తూ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు అంగీకరించని చోట బలవంతంగా పనులు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నగరంలో చేపట్టే అభివృద్ధి పనులన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, అవి దీర్ఘకాలం మన్నికగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మౌళిక సదుపాయాల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.