రక్తదానం కంటే గొప్ప పుట్టినరోజు వేడుక లేదు!

29 సార్లు రక్తదానం చేసిన కాంగ్రెస్ నాయకుడు.

రక్తదానం కంటే గొప్ప పుట్టినరోజు వేడుక లేదు!

చిల్పూర్,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు): 

పుట్టినరోజు అంటే కేకులు కోసి, ఆర్భాటాలు చేయడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని కాపాడటమే నిజమైన వేడుక అని చాటిచెప్పారు చిల్పూర్ మండల కాంగ్రెస్ నాయకుడు పోలేపల్లి రంజిత్ రెడ్డి. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆయన తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం హనుమకొండలోని రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నానని, ఇప్పటివరకు 29 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. రక్తదానంపై యువతలో అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
పుట్టినరోజును సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రంజిత్ రెడ్డికి రక్తదానంపై ఉన్న అవగాహన, సేవా దృక్పథాన్ని ప్రశంసించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.