ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పరిశీలన.
*మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి*
*అధికారులు, కాంట్రాక్టర్లకు డిప్యూటీ మేయర్ సునీల్ రావు సూచన*
కరీంనగర్, అక్టోబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు, విశిష్టతకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతాయి. ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే ఈ మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మను పేరుస్తారు.
ఈ సందర్భంగా, వేడుకలు జరుపుకోవడానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వేడుకలు జరిగే ప్రదేశంలో, ఘాట్ల వద్ద పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, భద్రతా చర్యలు పక్కాగా ఉండాలని ఆయన సూచించారు. బతుకమ్మ వేడుకలకు విచ్చేసే ప్రతి మహిళా సోదరి ప్రశాంతంగా, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.


Comments