ఫాదర్ కొలంబో పాఠశాలలో పూల జాతర!
ముందస్తు బతుకమ్మ వేడుకలతో మార్మోగిన పాఠశాల.
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఫాదర్ కొలంబో పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి సందడి చేశారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో పాఠశాల ప్రాంగణాన్ని సందడిమయం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరస్పాండెంట్ ఫాదర్ థామస్ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతిపై ప్రేమ, ఐక్యతాభావాన్ని అలవర్చడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి గొప్పతనం తెలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.


Comments