స్టేషన్ ఘన్‌పూర్‌లో వెల్లివిరిసిన విప్లవ స్ఫూర్తి!

స్టేషన్ ఘన్‌పూర్‌లో వెల్లివిరిసిన విప్లవ స్ఫూర్తి!

ఘనంగా చేగువేరా 59వ వర్ధంతి

ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఘన నివాళులు

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు): 

విప్లవ వీరుడు ఎర్నెస్టో చేగువేరా 59వ వర్ధంతిని పురస్కరించుకొని ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జనగామ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మహమ్మద్ యూనిస్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ మాట్లాడుతూ పేదలు, కార్మికుల హక్కుల కోసం చేగువేరా చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు యువత ముందుండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సాయి, కిరణ్, రాజు, కార్తీక్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గొడుగు రమేష్, అంజి, సాయితేజ, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.