విద్యారణ్యపురి కాలనీలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు.
యూఐడీఎఫ్ నిధులతో పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన.
కరీంనగర్, అక్టోబర్ 9(తెలంగాణ ముచ్చట్లు ):
నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని 28వ డివిజన్ విద్యారణ్యపురి కాలనీ, రోడ్ నంబర్ 3లో యూఐడీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడంతో పాటు, కాలనీల్లో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భాస్కర్ నాయక్, 3వ డివిజన్ కార్పొరేటర్ సాదినేని లావణ్య మునిందర్, స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


Comments