రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి!
ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని సర్పంచ్‌లు సూచించారు.స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని విశ్వనాథ్‌పూర్, తానేదార్‌పల్లి, రంగరాయిగూడెం గ్రామాల్లో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు మంతెన హరిత ఇంద్రసేనారెడ్డి, జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, భూక్యా అరుణ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం సేకరణ చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌లు డి. శ్రీకాంత్, గాదె శాంత భాస్కర్, సంఘాల అధ్యక్షురాళ్లు కంజర్ల లావణ్య, మంతెన వాణి, సట్ల నిరోష, వీఓఏలు హైమావతి, గీత, సంధ్యారాణి, వార్డు సభ్యులు, నాయకులు సంపత్ రెడ్డి, సుధాకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments