అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
కొత్తకోట స్వాతి రెడ్డి, బిజెపి నాయకురాలు.
Views: 0
On
పెద్దమందడి,అక్టోబర్10(తెలంగాణ ముచ్చట్లు):
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీజేపీ ఎండోమెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ కొత్తకోట స్వాతి రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని పెద్దమందడి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట స్వాతి రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పద్మనాభం పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 Oct 2026 21:38:16
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...


Comments