పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి..

ప్రభుత్వానికి విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం విజ్ఞప్తి.

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి..

వనపర్తి,అక్టోబర్09(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మోజర్ల మాజీ సర్పంచ్, పాలిటెక్నిక్ విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు మన్నెం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రకటించినట్లుగానే పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించాలని కోరారు. అదేవిధంగా, విద్యార్థుల వసతి, భోజన సదుపాయాల కోసం సంక్షేమ హాస్టళ్లను అక్టోబర్ 15 వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.హాస్టళ్లను ముందుగానే మూసివేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండేందుకు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పేద, రైతు కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన వసతి సదుపాయాలు కల్పించాలని కోరారు.హాస్టళ్ల మూసివేత కారణంగా తరగతులకు హాజరుకాలేని విద్యార్థులకు హాజరు మినహాయింపు ఇవ్వాలని, కోల్పోయిన ల్యాబ్ ప్రాక్టికల్స్, అంతర్గత పరీక్షలకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం తగదు.. వారి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి అని గట్టు మన్నెం స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.