రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కాజీపేట్ అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ లో నిర్మాణం అవుతున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించేందుకు వచ్చిన రైల్వే డైరెక్టర్ ఎం ఈ పి యు జయంత్ రామచంద్రన్ రైల్వే బోర్డు సభ్యుడు పి యు సునీల్ కుమార్, పిసిసి ఎం విజయ్ కుమార్, సిఎంఈ లచ్చిరాం భూక్య, ఆర్ వి ఎన్ ఎల్ జి జి ఎం బి మురళీకృష్ణ లను కలిసి తెలంగాణ రైల్వే జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ ఏర్పాటు అయిన ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉన్నచోట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలని విభజన చట్టంలో ఉన్న కారణంగా తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి అట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నెలకొల్పాలని పోరాటాల ద్వారా సాధించుకున్న కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన వారికి ఆ భూములపైన కూలీ పనులు చేసుకున్న వారికి స్థానిక నిరుద్యోగ యువతీ యువకులతో పాటు రైల్వేలో ఆక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైల్వే బోర్డ్ సభ్యులను రైల్వే జేఏసీ వారు కోరారు. ఈ విషయమై బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందిస్తూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఈ ప్రాంతం వారికే లభించే విధంగా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారని తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్హతను బట్టి నియామకాలు చేపడతామని వారు తెలిపారని జేఏసీ తెలిపింది . ఈ కార్యక్రమంలో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు, కో కన్వీనర్ అనుమాస శ్రీనివాస్, డి రవీందర్, వి తిరుపతి, జి భాస్కర్, ఎం రాజయ్య, వైస్ చైర్మన్లు పి రమేష్, వస్కుల రవీందర్, ప్రవీణ్, సిరిమల రమేష్ కుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
డీజిల్ లోకో షెడ్ ను సందర్శించిన రైల్వే ఉన్నతాధికారులు
కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ ను పిసిఎంఈ విజయకుమార్ సి.ఎం లచ్చిరాం భూక్య మాజీ పిసి ఎం ఈ మధుసూదన్ లు శుక్రవారం సందర్శించారు. డీజిల్ లోకో షెడ్ కు విచ్చేసిన ఉన్నత అధికారులను మజ్దూర్ యూనియన్ డీజిల్ లోకో షెడ్ బ్రాంచ్ తరఫున ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అధికారులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలి ఇచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్, డీజిల్ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ పేద ప్రకాష్, ట్రెజరర్ కామ్రేడ్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ కామ్రేడ్ యాదగిరి, అసిస్టెంట్ సెక్రటరీ కామ్రేడ్ మహేష్ బాబు,నరేష్ యాదవ్, యూత్ కమిటీ సభ్యులు కామ్రేడ్ రాముల సదానందం ,కామ్రేడ్ దినేష్ కామ్రేడ్ సాంబయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


Comments