పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
వనపర్తి,అక్టోబర్21(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు వీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగం సమాజానికి స్ఫూర్తిదాయకమని, ప్రజల రక్షణ కోసం వారు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ సమాజ భద్రత కోసం వారు చేసిన త్యాగం ఎప్పటికీ గౌరవప్రదమైనదని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.పోలీసు అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా, వారు చూపిన సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆకాంక్షించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమని పేర్కొంటూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, డీఎస్పీ గిరిబాబు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments