క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.
తుడి శ్రీనివాసరెడ్డి తుడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్.
పెద్దమందడి,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వెల్టూర్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ట్రోఫీ పోటీల్లో విజేతలకు తుడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ తుడి శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తుడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. గెలిచిన వారు విజయంతో అహంకారానికి లోనుకాకుండా వినయంగా ఉండాలని, ఓటమి పాలైన వారిని తక్కువగా చూడకూడదని హితవు పలికారు. ఓటమిని విజయానికి తొలి మెట్టుగా భావించి, తప్పులను సరిదిద్దుకుంటూ మరింత పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడుతూ తమ ప్రతిభను చాటుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ, పాల్గొన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, హైకోర్టు ఏజీపీ హంసు వర్మ, గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, పెద్దమందడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దిండు రవీందర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాల చంద్రయ్య, డి. ఎస్ మహేష్, వడ్డె శేఖర్, బిజెపి రమేష్, వివేక్, మల్లికార్జున్, రామచంద్రయ్య గౌడ్, పవన్ కుమార్ రెడ్డి, నరేష్, డీలర్ శ్రీనివాసులు, నాగభూషణ్, మద్దూర్ నరసింహ, రామచంద్రయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.


Comments