కోహెడలో ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్.
విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేసిన గవ్వ వంశీధర్ రెడ్డి.
కోహెడ, అక్టోబర్ 17(తెలంగాణ ముచ్చట్లు ):
కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో విజేతగా నిలిచిన కోహెడ జట్టుకు రూ.10 వేల నగదు, ట్రోఫీని, రన్నరప్గా నిలిచిన రాయపోలు మండలం వడ్డేపల్లి జట్టుకు రూ.5 వేల నగదు, ట్రోఫీని అందజేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు గవ్వ వంశీధర్ రెడ్డి నగదు పురస్కారాలు, ట్రోఫీలను అందించారు.
ఈ సందర్భంగా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లక్ష్యంతో ముందుకు సాగాలని, దురలవాట్లకు దూరంగా ఉంటూ సామాజిక స్పృహతో వ్యవహరించాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువతను ప్రోత్సహించేందుకు గత 20 ఏళ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, క్రీడలతో పాటు వివిధ సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కోహెడ ప్రజలకు అన్ని రంగాల్లో తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి సేవలను కొనియాడారు. వైద్య శిబిరాలు, ధార్మిక కార్యక్రమాలు, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ ద్వారా ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా క్రమశిక్షణతో ఎదిగేందుకు ఇలాంటి క్రీడా పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, సంకల్ప సేవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, డాక్టర్ సీహెచ్. దయాకర్, గవ్వ వంశీధర్ రెడ్డి యువసేన సభ్యులు పూసాల రాజశేఖర్, కలికోట రాహుల్, చారి, రఘు యాదవ్, అవినాష్, వంశీ, నోమన్, అంజి, మనీ తదితరులు పాల్గొన్నారు.


Comments