బెజ్జంకి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి.

బెజ్జంకి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి.

*మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం.*

*సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ*

మానకొండూర్, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు ):

మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఎస్సీ సంక్షేమం వంటి అంశాలపై మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మండల స్థాయిలో ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.