ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.

-ఎన్‌హెచ్‌–563 పనులు పూర్తి చేయాలి.. రామాలయ నిర్మాణానికి రూ.10 లక్షల సాయం అందించాలని వినతి

ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత తంగెడ గోపాల్‌రావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న నిర్వహించనున్న ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను గ్రామస్తులు ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మంత్రి సానుకూలంగా స్పందించి, కార్యక్రమానికి హాజరవుతానని అంగీకరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌–563పై పెండింగ్‌లో ఉన్న అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని మంత్రిని కోరారు. అలాగే గ్రామంలోని శ్రీ కొదండ రామాలయం, శ్రీ ధన్వంతరి మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి గతంలో ఆమోదించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సాయం అందిస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తక్కళ్లపెల్లి సంపత్రావు, గొంగిడి మనోహర్ రెడ్డి, డాక్టర్ జె. శ్రీనివాస్ రెడ్డి, ఆలయ నిర్మాణ సేవా బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.