నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
ఎల్‌నినో ప్రభావం.. రబీ పంటల సాగుపై వీడియో కాన్ఫరెన్స్.
Views: 3
On
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు రైతులకు దిశానిర్దేశం చేయనున్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు మల్కాపూర్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడి, రబీ పంటల సాగుపై సూచనలు చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సింగరావు ఒక ప్రకటనలో కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Oct 2026 21:22:12
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...


Comments