బాలగోపాల్ ఆశయాలే స్ఫూర్తి.

అణచివేతపై యువత పోరాడాలి.. అంబటి నాగయ్య పిలుపు.

బాలగోపాల్ ఆశయాలే స్ఫూర్తి.

హుజూరాబాద్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు ):

అవినీతి, అణచివేతలకు వ్యతిరేకంగా యువతరం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో నైతిక విలువలతో ముందుకు సాగినప్పుడే సమాజంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని అన్నారు.
హుజూరాబాద్‌లో మానవ హక్కుల వేదిక, దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పౌరహక్కుల ఉద్యమ నేత కే. బాలగోపాల్ 17వ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న అంబటి నాగయ్య మాట్లాడుతూ.. పాలకుల అణచివేతకు తలొగ్గకుండా, రాజ్యాంగబద్ధంగా బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాలగోపాల్ అడుగుజాడల్లో యువత నడవాలని కోరారు. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యమే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమని పేర్కొన్నారు.
నిట్‌లో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నత హోదాలో కొనసాగిన బాలగోపాల్ వ్యక్తిగత సుఖాలను పక్కనపెట్టి అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఎన్‌కౌంటర్లు, అక్రమ అరెస్టులు, లాకప్‌ మరణాలపై నిజనిర్ధారణ చేపట్టి బాధితుల తరఫున నిలిచారని గుర్తుచేశారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ.. హింస ఎవరి చేతిలో ఉన్నా తప్పేనని స్పష్టం చేసిన ప్రజాస్వామికవాది బాలగోపాల్ అని అన్నారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ముక్కెర రాజు మాట్లాడుతూ.. నిరుపేదలు, నిర్వాసితుల పక్షాన ఉచితంగా న్యాయపోరాటం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
సభలో ఛత్తీస్‌గఢ్‌లోని భీరంఘాటి ఆదివాసీలకు విధించిన మరణశిక్షను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు శాంతియుత, రాజ్యాంగబద్ధ పోరాటాలు కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.