నాణ్యమైన వస్త్రాలతో వినియోగదారుల నమ్మకాన్ని పొందాలి.
గరుడ వస్త్రాలయం ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి.
వనపర్తి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్రాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. వస్త్రాలయ నిర్వాహకులు రఘునందన్ రెడ్డి, అనంత్ రెడ్డి, అఖిల్ గౌడ్ ఆహ్వానం మేరకు ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చిన్నారెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ, వనపర్తి జిల్లా కేంద్రంలో నూతన వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం పట్టణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వారి నమ్మకాన్ని పొందడమే వ్యాపార సంస్థల ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలతో వినియోగదారుల ఆదరణ పొందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. గరుడ వస్త్రాలయం ప్రజల ఆదరణ పొందుతూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో తెలంగాణ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా ఏఐపీసీ అధ్యక్షులు నాగార్జున, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సమ్మద్ మియా, పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నారాయణ, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఎత్తం చరణ్ రాజ్, శ్రీరంగాపురం సర్పంచ్ మద్దిలేటి, సీనియర్ నాయకులు పాండురావు, నందిమల్ల రాము, వెంకటేశ్వర రెడ్డి, మన్యం యాదవ్, ద్వారపోగు విజయ్ బాబు, సిరివాటి సురేష్, ఆసిఫ్ మియా, రాముడు, బాల్ రాజు, నందిమల్ల సందీప్, నాగరాజు, వెంకటేష్, చందు, కురుమన్న, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments