పెద్దమందడిలో మాదిగ వైద్య బృందం ఆత్మీయ సమ్మేళనం.
వైద్య సేవలకు సిద్ధం.. సొంత గ్రామానికి సేవ చేయడమే లక్ష్యం.
పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్లు, వైద్య బృందం ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమ్మేళనంలో వివిధ రంగాల్లో స్థిరపడిన ఉద్యోగులు, గ్రామానికి చెందిన ప్రముఖులు పాల్గొని వైద్య బృందాన్ని అభినందించారు. సమాజం పట్ల బాధ్యతతో గ్రామానికి సేవలందిస్తున్న వారిని గ్రామస్తులు సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. సొంత గ్రామానికి తమ వంతుగా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నారు. వైద్యులుగా ఎదిగి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైన వైద్య సలహాలు, సేవలను అందిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతామని వెల్లడించారు.వివిధ రంగాల్లో స్థిరపడి, సామాజిక దృక్పథంతో గ్రామానికి సేవలందిస్తున్న ఉద్యోగులు, ప్రముఖులను ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు. సొంత ఊరితో అనుబంధాన్ని కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం పరస్పర ఆత్మీయతను పెంపొందించింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూ
త్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని పాల్గొన్నవారు పేర్కొన్నారు.


Comments