కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు.

పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి .

కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు.

పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి దశాబ్ది పూర్తయిన సందర్భంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా అభివృద్ధికి మరింత అవకాశం ఏర్పడిందని నాయకులు పేర్కొన్నారు.వనపర్తి జిల్లా ఏర్పాటు తర్వాత పెద్దమందడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రవాణా సౌకర్యాలు తదితర రంగాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. వనపర్తి జిల్లా అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ, ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వేణు యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.