మనిగిల్ల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన.
పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మనిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఆదివారం మార్నింగ్ వాక్‌లో భాగంగా 10, 11వ వార్డుల్లో పర్యటించి కాలనీవాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వీధి దీపాల సమస్యల పరిష్కారానికి కొత్త బల్బులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. రోడ్ల అభివృద్ధితో పాటు అవసరమైన చోట కొత్త డ్రైనేజీల నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు డ్రైనేజీలను శుభ్రపరచడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కంపచెట్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు.భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా అవసరమైన వారు తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై కాలనీవాసులను అడిగి తెలుసుకుని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామంలోని వార్డులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గర్రెమోని బాలకృష్ణ, బోడి బాలకృష్ణ, ప్రేమ్ కుమార్ రెడ్డి, కాలనీవాసులు రమేష్, సత్తి తదితరులు పాల్గొన్నారు.


Comments