జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.

పొన్నెకల్ వద్ద నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి పొంగులేటి.

జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )

 వచ్చే విద్యా సంవత్సరం జూన్‌ నాటికి పొన్నెకల్‌ వద్ద నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పొన్నెకల్‌ వద్ద రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన పాఠశాల భవన సముదాయ నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ దివాకర.టీఎస్‌తో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాంగణమంతా కలియతిరుగుతూ వివిధ విభాగాల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. అధికారులు మ్యాప్ ల ప్రస్తుత పరిస్థితిని వివరించారు. పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
*కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే లక్ష్యం*
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడమే ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
*ఈ కార్యక్రమంలో..:* ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.