30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.

30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )

కూసుమంచి మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎస్పీ సునీల్‌దత్‌లతో కలిసి లబ్ధిదారులకు మొత్తం రూ.30,03,480 విలువ చేసే చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ప్రజా పాలన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, సర్పంచ్ కొండా కృష్ణవేణి, 
పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.