మృతురాలి కుటుంబానికి మేఘన్న అభయహస్తం.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం సర్పంచ్ రాములు యాదవ్ .
పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన నట్టాల లక్ష్మి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. మేఘన్న అభయహస్తం ద్వారా కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా రూ.5000/- వేల ఆర్థిక సాయాన్ని అందించారు.అలాగే, మృతురాలితో కలిసి పనిచేసిన తాపీ మేస్త్రీ పి. సాగర్ తన వంతుగా మానవత్వ దృక్పథంతో రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములు యాదవ్, ఉప సర్పంచ్ రవి సాగర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగులయ్య, వార్డు సభ్యుడు బలయ్య, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు సత్యారెడ్డి, పి. నారాయణ, జె. తిరుపతయ్య, బాల బుచ్చన్న, వెంకటేష్ గౌడ్‌తో పాటు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.


Comments