దుర్గామాత ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

దుర్గామాత ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

* అమ్మవారి ఆశీస్సులతో జమ్మికుంట ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

జమ్మికుంట, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

భక్తి పారవశ్యం.. ఆధ్యాత్మిక శోభ మధ్య జమ్మికుంట పట్టణంలో శ్రీ దుర్గామాత ఆగమన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత కృపాకటాక్షాలు పట్టణ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలే కాకుండా ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటిచెప్పే పండుగలని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

అమ్మవారి మండపాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. భక్తులందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.