మర్రిచెట్టు శివాలయం ఎదుట దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ.. వైభవంగా పూజా కార్యక్రమాలు.

మర్రిచెట్టు శివాలయం ఎదుట దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): 

మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయం ఎదురు వీధిలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
వాస్తు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నర్సింగోజు బ్రహ్మచార్యులు, రాణి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం 10.15 గంటలకు కలశస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, గణపతి పూజ, నవగ్రహ పూజ, శ్రీచక్ర నవావరణ అర్చన, పంచామృతాభిషేకం, అగ్ని ప్రతిష్ఠాపన, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రతిరోజూ విశేష కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మవారి విగ్రహ దాత గన్ను సునీత–శ్రీనివాస్ దంపతులతో పాటు శివసతి సృజన్ కుమార్, కొలిపాక సతీష్, ఈశ్వర్ ప్రసాద్, సంకీర్త్, సుజాత–సుధాకర్ దంపతులు, రవీందర్, కిషన్ రాజు, చారి, కృష్ణ, మామిడ్ల శ్రీనివాస్, వేణు, నవనీత్, మహేష్, సుమశ్రీ, స్వరూప, నితీజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.