మర్రిచెట్టు శివాలయం ఎదుట దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం.
అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ.. వైభవంగా పూజలు.
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్11 (తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయం ఎదుట వీధిలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వాస్తు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నర్సింగోజు బ్రహ్మచార్యులు, రాణి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం 10:15 గంటలకు కలశస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు గణపతి పూజ, నవగ్రహ పూజ, శ్రీచక్ర నవావరణ అర్చన, పంచామృత అభిషేకం, అగ్ని ప్రతిష్ఠాపన, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాత గన్ను సునీత–శ్రీనివాస్ దంపతులు, శివసతి సృజన్ కుమార్, కొలిపాక సతీష్, ఈశ్వర్ ప్రసాద్, సంకీర్త్, సుజాత–సుధాకర్ దంపతులు, రవీందర్, కిషన్ రాజు, చారి, కృష్ణ, మామిడ్ల శ్రీనివాస్, వేణు, నవనీత్, మహేష్, సుమశ్రీ, స్వరూప, నితీజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments