ముల్కనూర్ ప్రయాణికుల ఇబ్బందులకు చెక్.. ఉపసర్పంచ్ మమత చొరవ.

సొంత నిధులతో బస్టాండ్‌కు మరమ్మతులు.

ముల్కనూర్ ప్రయాణికుల ఇబ్బందులకు చెక్.. ఉపసర్పంచ్ మమత చొరవ.

భీమదేవరపల్లి, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)

ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు బాధ్యతగా ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కాసగోని మమత బాలకృష్ణ ముందడుగు వేశారు. ముల్కనూర్ బస్టాండ్‌లో గుంతల కారణంగా ప్రయాణికులు, ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి, తన సొంత నిధులతో మరమ్మతులు చేయించారు.

గతంలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బస్టాండ్ సమీపంలో నూతన మురుగునీటి కాలువలు నిర్మించడంతో బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు, బస్టాండ్‌లో గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ఈ సమస్యను గుర్తించిన ఉపసర్పంచ్ మమత బాలకృష్ణ స్వచ్ఛందంగా స్పందించి, సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గేలా చర్యలు తీసుకున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా ముందుకు వచ్చి తన వంతు సహకారం అందించిన ఉపసర్పంచ్మమత బాలకృష్ణను స్థానికులు అభినందిస్తున్నారు.IMG-20261011-WA0005

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.