అంతర్జాతీయ పురస్కార గ్రహీతకు పదో తరగతి మిత్రుల ఘన సన్మానం.
శాంతి ప్రతిభా పురస్కారంతో పాటు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు
భీమదేవరపల్లి, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తమతో కలిసి పదో తరగతి చదువుకున్న మిత్రుడు, వి6 వెలుగు రిపోర్టర్ మాడుగుల రాజ్‌కుమార్‌కు అంతర్జాతీయ శాంతి ప్రతిభా పురస్కారం లభించడంతో పాటు ఇటీవల భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన పదో తరగతి మిత్రబృందం ఘనంగా సన్మానించింది.
ఆదివారం ముల్కనూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిత్రులంతా రాజ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. తమతో కలిసి చదువుకున్న మిత్రుడు జర్నలిజం రంగంలో విశేష గుర్తింపు పొందడంతో పాటు అంతర్జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాడుగుల గోపి, కొదురుపాక కుమారస్వామి, పారునందుల మహేందర్, మాడుగుల పరమేష్, పోలూ వెంకటేష్, కడారి ప్రశాంత్, గుర్రపు వెంకటేశ్వర్లు, దొండ శ్రీను తదితర మిత్రులు పాల్గొన్నారు.


Comments