కేసీఆర్ దూరదృష్టితోనే చిన్న జిల్లాల ఏర్పాటు.
వనపర్తి జిల్లా ఏర్పాటులో నిరంజన్‌రెడ్డి కృషి మరువలేనిది
-- బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి
పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో చిన్న జిల్లాల ఏర్పాటు జరిగి దశాబ్ది కాలం పూర్తయిన సందర్భంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనే పెద్ద జిల్లాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న పరిపాలనా ఇబ్బందులను కేసీఆర్ గుర్తించారని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందాలనే ఉద్దేశంతో చిన్న జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని, చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలనా సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని కొనియాడారు.వనపర్తి జిల్లాను ఏర్పాటు చేయడంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృషి ఎంతో ఉందని అల్వాల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా ఏర్పాటు కోసం నిరంజన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు, చూపిన చొరవ మరువలేనివని అన్నారు.తెలంగాణలో చిన్న జిల్లాల ఏర్పాటు లక్ష్యాలు, వాటి ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంకట్ రెడ్డి కొనియాడారు. అదే విధంగా వనపర్తి జిల్లా ఏర్పాటులో నిరంజన్‌రెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు.


Comments