కేటీఆర్ పిలుపుతో కదిలిన ఘన్‌పూర్ గులాబీ దళం!
కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..
జనగామ ర్యాలీకి బైక్ ర్యాలీగా బీఆర్ఎస్ శ్రేణులు
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కదిలాయి. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఘన్‌పూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీగా జనగామలో నిర్వహించనున్న శాంతియుత ర్యాలీకి పెద్ద సంఖ్యలో బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments