వనపర్తిలో గరుడ వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వనపర్తిలో గరుడ వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వనపర్తి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని కొత్తకోట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్రాలయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, సినీ హీరోయిన్ భాగ్యశ్రీ కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వస్త్రాలయ నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు వస్త్రాలయాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన వస్త్రాల విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి వస్త్రాలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వ్యాపార సంస్థల ఏర్పాటుతో పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు విస్తరించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వస్త్రాలయ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.