ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
ఖమ్మం బ్యూరో , అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు )
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ అండర్ 12 లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి సుధగాని ఉపేక్షిత్ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాడు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, ట్రైబల్ మోడల్ స్పోర్ట్ గర్ల్స్ స్కూల్లో జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-12 విభాగంలో పాల్గొన్న ఉపేక్షిత్ తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఉపేక్షిత్, డాక్టర్ సుధగాని కరుణాకర్ భరణిక దంపతుల కుమారుడు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కోచ్‌ల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా శిక్షణ పొందుతున్న ఆయన, రాష్ట్రస్థాయి పోటీల్లో 300 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి ప్రశంసలు అందుకున్నాడు.
అంతేకాకుండా, లాంగ్ జంప్ విభాగంలో కూడా కృషి చేసి ప్రతిభను కనబరిచాడు.
ఈ విజయంతో ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్‌కు మరోసారి గుర్తింపు లభించిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఉపేక్షిత్ విజయంతో కోచ్‌లు గౌస్ పాషా, హలీం పాషా అందించిన శిక్షణ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ సందర్భంగా మెడల్స్ పొందిన విద్యార్థిని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు అభినందించారు. అలాగే జిల్లా క్రీడా ప్రముఖులు, అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు, తల్లిదండ్రులు ఉపేక్షిత్ భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


Comments