పెద్దమందడిలో వైద్యులకు ఘన సన్మానం.

పెద్దమందడిలో వైద్యులకు ఘన సన్మానం.

22 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని సత్కరించిన అంబేద్కర్ యూత్

పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైద్యులు, వైద్య సిబ్బందికి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 22 మంది ఎంబీబీఎస్‌ వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది, వివిధ వైద్య రంగాల్లో సేవలందిస్తున్న వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వారి సేవలను గుర్తించి, వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు చికిత్స అందించడంతో పాటు వారిలో ధైర్యం, భరోసా నింపడంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్యులు నిరంతరం చేస్తున్న కృషి అభినందనీయమని, వైద్య సేవలందిస్తున్న వారిని గౌరవించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామానికి చెందిన వైద్యులను ఒకే వేదికపై సత్కరించడం ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వైద్య వృత్తి పట్ల గౌరవాన్ని చాటిచెప్పినట్లయిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.