పొరండ్ల సొసైటీ నూతన చైర్మన్‌గా గోపు తిరుపతి రెడ్డి.
ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.
మానకొండూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పొరండ్ల సహకార సంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన గోపు తిరుపతి రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో గోపు తిరుపతి రెడ్డి నూతన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, పొరండ్ల సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని నూతన చైర్మన్‌కు సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచుతూ వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. సహకార సంఘాలు రైతుల అభ్యున్నతికి వెన్నెముకగా నిలవాలని, పారదర్శకమైన పాలనతో సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సహకార సంఘం డైరెక్టర్లు, సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్ గోపు తిరుపతి రెడ్డికి అభినందనలు తెలిపారు.


Comments