పామిరెడ్డిపల్లిలో వైరాగ్యగిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం.

అతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

పామిరెడ్డిపల్లిలో వైరాగ్యగిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం.

పెద్దమందడి,అక్టోబర్11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ వైరాగ్యగిరిశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు. కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు తీర్థప్రసాదాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.