అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెట్టెలపాడు నుండి బీరోలు ఆర్ అండ్ బి రోడ్డు వరకు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, సుబ్లేడు గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. తిరుమలాయపాలెం మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఇది ప్రజలు మనస్పూర్తిగా ఆశీర్వదించిన ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి మంచి చేయాలని, పేదవాళ్ళకి అండదండలుగా ఉండాలని, పేదవాడి కుటుంబం కూడా చిరునవ్వులతో ఎప్పుడూ జీవించాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ 33 నెలల్లో మీ గుమ్మానికి చేర్చిందన్నారు.
200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్‌గా క్వింటాలుకు 500 రూపాయలు, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు, ఏ పార్టీ అని, ఏ కులమని, ఏ మతమని అడగమని, చివరికి ఇల్లు ఇస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తావా అని కూడా అడగమని అన్నారు.
*ఈ కార్యక్రమంలో..:* కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, పార్టీ మాజీ అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్, సర్పంచ్ లు సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి, నర్సమ్మ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Comments