తాటికొండలో శరన్నవరాత్రి శోభ.

బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ.

తాటికొండలో శరన్నవరాత్రి శోభ.

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని తాటికొండ గ్రామంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.అర్చకుడు జీడికంటి వరుణాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం కుంకుమపూజ, అర్చన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భవానీ మాలధారులు పండగ రాజేశ్వర్, పర్శరాజు, సత్తయ్య, రవి, అక్కెనపల్లి రాములు, రాకేష్, మారపాక నాగరాజు, శ్రీపతి రాజు, నారబోయిన కార్తీక్‌తో పాటు మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.