స్మశాన వాటికలో సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ చొరవతో సౌకర్యాలు!
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాలి ప్రమోద్ రెడ్డి అడుగులు.
భీమదేవరపల్లి, అక్టోబర్ 11(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ముల్కనూర్ గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి మరోసారి తన చొరవను చాటుకున్నారు. గ్రామంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించారు. సమస్యను గుర్తించి, ఇబ్బందులు తొలగించేలా స్మశాన వాటికలో మోరం వేయించి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో సేవను చూపిస్తున్న సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ గ్రామాభివృద్ధే ధ్యేయంగాముందుకు సాగుతున్నారు. 


Comments