దుర్గా కాలనీలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠకు వేడుకలు ప్రారంభం.

దుర్గా కాలనీలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠకు వేడుకలు ప్రారంభం.

గణపతి పూజలు, సామూహిక హోమాలతో ఆధ్యాత్మిక సందడి

నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాక

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి వెనుక ఉన్న దుర్గా కాలనీలోని శ్రీ కనకదుర్గ ఆలయం నిర్మించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, సామూహిక హోమాలు, పుష్పాభిషేకం, ధాన్యాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సోమవారం జరగనున్న అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరుకానున్నట్లు ఆలయ ధర్మకర్త పాసర్లపూడి లక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెండ్ల సమ్మయ్య పాల్గొన్నారు. పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.