అమ్మపల్లిలో పశువులకు ఉచిత వైద్య శిబిరం.

అమ్మపల్లిలో పశువులకు ఉచిత వైద్య శిబిరం.

పెద్దమందడి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):

పశువుల ఆరోగ్య పరిరక్షణకు, పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణకు పశుపోషకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశువైద్య అధికారి డాక్టర్ శ్యామ్ సూచించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ, నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ మాట్లాడుతూ.. పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించడం, వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే పశువైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పశువుల్లో గర్భకోశ సంబంధిత సమస్యలను నివారించేందుకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, నట్టల నివారణకు పశువైద్యుల సూచనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.పశువుల ఆరోగ్యం బాగుంటేనే పాల ఉత్పత్తి మెరుగుపడి పశుపోషకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పశువుల పెంపకంలో పరిశుభ్రత పాటిస్తూ, వాటికి సమతుల్యమైన ఆహారం అందించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ అందించే వైద్య సేవలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎల్‌ఎస్‌ఏ వెంకటేష్, గోపాలమిత్ర సూపర్వైజర్ భారతీష, గోపాలమిత్రులు లక్ష్మీ నరసింహ, రాఘవేంద్ర రెడ్డితో పాటు ఇతర సిబ్బంది, గౌని వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.