జాఫర్‌గడ్‌లో రోడ్డు కబ్జా కలకలం!

జాఫర్‌గడ్‌లో రోడ్డు కబ్జా కలకలం!

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణలు

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు.. 

రోడ్డుపై ముళ్లకంప వేసి గ్రామస్తుల నిరసన

జాఫర్‌గడ్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలం, రహదారిని ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న దారిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై ముళ్లకంప వేసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, దారిని ఆక్రమించడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సముద్రాల రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపడుతున్నారని, దీనిపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ఆ దారి వెనుక నివసిస్తున్న మూడు కుటుంబాలు పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు, కలెక్టర్‌ ప్రజావాణి విభాగానికి ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొన్నారు. సామాన్యులు చిన్నపాటి షెడ్డు నిర్మించుకున్నా వెంటనే తొలగించే అధికారులు, ఇక్కడ ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వ దారి ఆక్రమణపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రIMG-20261012-WA0034మంలో సముద్రాల రాజు, సముద్రాల బక్కయ్య, దరిపెల్లి రాజు, సీ. వీరయ్య, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.