మహిళలకు న్యాయం ఏదీ? రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలి.

బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కవిత యాదవ్.

మహిళలకు న్యాయం ఏదీ? రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలి.

వనపర్తి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):

మహిళా విద్యార్థినులపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బీమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తిలో బీజేపీ మహిళా మోర్చా నిరసన చేపట్టింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జి. కవిత యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కవిత యాదవ్ మాట్లాడుతూ, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా విద్యార్థినులపై వేధింపుల వ్యవహారంలో సంబంధిత ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు.మహిళల హక్కులు, భద్రత గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, మహిళలకు సంబంధించిన ఆరోపణలపై కూడా స్పందించాలని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగిన నేపథ్యంలో వనపర్తిలోనూ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, మహిళల రక్షణకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నక్క మహేష్ యాదవ్, వాణిజ్య సెల్ రాష్ట్ర ఈసీ సభ్యుడు బాసెట్టి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శులు వారణాసి కల్పన, పెద్దిరాజు, శ్వేతా యాదవ్, సీనియర్ నాయకురాలు సుమిత్రమ్మ, సరోజ యాదవ్, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ గోపీనాథ్, పట్టణ అధ్యక్షుడు బత్తిని మధు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, కౌన్సిలర్ విజయ్, మహిళా నాయకురాళ్లు సత్యమ్మ, మహేశ్వరి, పుష్ప భారతి, కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతయ్య, బాలపిరు, రాయన్న, చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.