64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
*రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ*
*ముకరాంపురలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, అక్టోబర్ 13(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని 64వ డివిజన్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముకరాంపుర జఫ్రీ మసీదు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజతో కలిసి రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముకరాంపుర ప్రాంతంలో మురుగునీటి కాలువ పనులు చేపట్టి వర్షాకాలంలో ఎదురవుతున్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత సమయంలో పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను మేయర్ ఆదేశించారు. నగర అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.


Comments