మల్కాపూర్‌ను మండలం చేస్తామని మోసం చేశారు!
పబ్లిక్ స్కూల్ మా హక్కు.. సాధించే వరకు పోరాటం
రూ.1,400 కోట్ల అభివృద్ధి ఎక్కడ? కడియం శ్రీహరిపై కేశిరెడ్డి రాకేష్ రెడ్డి ప్రశ్నలు
చిల్పూర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని, పబ్లిక్ స్కూల్ విషయంలోనూ అన్యాయం జరిగిందని కేశిరెడ్డి రాకేష్ రెడ్డి విమర్శించారు. పబ్లిక్ స్కూల్ తమ హక్కు అని, దాన్ని తిరిగి మంజూరు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి.. ఆ అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రజలకు వివరించాలని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.మల్కాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని, పబ్లిక్ స్కూల్‌ను తిరిగి మంజూరు చేయాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించాలని అన్నారు.రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.సోమవారం గ్రామంలోని పాఠశాల అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేశిరెడ్డి రాకేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


Comments