నష్కల్ లో తాగునీటి కష్టాలు.. మురికి నీటితో రోగాల భయం.
*ట్యాంకుకు మెట్లు లేక శుద్ధి కరవు.. పట్టించుకోని అధికారులు*
*ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. స్పందించాలని డిమాండ్*
చిల్పూర్, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని నష్కల్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు మురికిమయంగా మారాయి. నల్లాల్లో వచ్చే నీటిలో తోకపురుగులు, చెత్తాచెదారం వస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మురికి నీరు తాగి దద్దుర్లు, దురద, జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ముందు నిరసన తెలిపారు.
గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. మిషన్ భగీరథ ట్యాంకుకు మెట్లు లేకపోవడంతో శుద్ధి చేయలేకపోతున్నామని పంచాయతీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏఈ, డీఈలకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

"నల్లా నీళ్లలో పురుగులు వస్తున్నాయి. పిల్లలు తాగితే దద్దుర్లు వస్తున్నాయి. నాణ్యత లేని మెట్లు నిర్మించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని స్వచ్ఛమైన నీటిని అందించాలి"
*10వ వార్డు మెంబర్ రజిత*
"సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాం. మెట్లు లేక శుద్ధి చేయలేమని చెబుతున్నారు. వెంటనే పరిష్కరించాలి"
*సర్పంచ్, చాతబోయిన రాజు యాదవ్*
"ప్రజలు నా దృష్టికి తేవడంతో ఏఈ, డీఈలను పలుమార్లు కలిశాను. ట్యాంకుకు మెట్లు లేక శుద్ధి చేయలేకపోతున్నాం. అధికారులు వెంటనే మెట్లు నిర్మిస్తే ట్యాంకు శుద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తాం"


Comments