కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

*ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసనకు మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

కరీంనగర్, అక్టోబర్ 13(తెలంగాణ ముచ్చట్లు ):

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సచివాలయం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ఉద్యోగులకు మద్దతు తెలిపారు. వారి డిమాండ్లకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని కోరారు.

కాంట్రాక్టు ఉద్యోగులను మరుసటి రోజు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కల్పించి, పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, వారికి తగిన న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భరోసా కల్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.