భగత్ నగర్‌లో దుర్గామాత మండపాలను దర్శించుకున్న డిప్యూటీ మేయర్.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యాదగిరి సునీల్ రావు.
Views: 0
On
కరీంనగర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని భగత్ నగర్‌లో ప్రతిష్టించిన పలు దుర్గామాత మండపాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భగత్ నగర్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మంగమ్మ మార్కెట్ వద్ద చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఆయన సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Oct 2026 21:01:59
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...


Comments