ఘన్‌పూర్‌లో అమ్మవారి పునఃప్రతిష్ఠ వైభవం!

కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

ఘన్‌పూర్‌లో అమ్మవారి పునఃప్రతిష్ఠ వైభవం!

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు): 

మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి వెనుక ఉన్న దుర్గా కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక శోభతో వైభవంగా నిర్వహించారు. ఆలయం నిర్మించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, బలిప్రదానం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనకదుర్గమ్మ కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పాసర్లపూడి లక్ష్మి, అమ్మానాన్న ఫౌండేషన్ చైర్మన్ రేండ్ల సమ్మయ్య, పాసర్లపూడి నాగరాజు, మోటం కాలేష్, పస్తం రాజు, పాసర్లపూడి వివేక్, సిద్ధార్థతో పాటు గోవర్ధనగిరి గ్రామానికి చెందిన భవానీలు, లక్ష్మి కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.IMG-20261012-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.