గుండెపోటుతో యువకుడు మృతి.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
పెద్దమందడి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మన్నిగిళ్ల గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి (38) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం మన్నిగిళ్ల గ్రామంలోని మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి తండ్రి శేఖర్ రెడ్డిని కలిసి రాజేందర్ రెడ్డి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ రత్నయ్య, మేరెడ్డి తిరుపతిరెడ్డి, కొండా రవీందర్ రెడ్డి, బోడి తిరుపతయ్య, వెంకటేష్, నరసింహ రెడ్డి, శివ యాదవ్, బోడి కృష్ణయ్య, బాలపీరు, ముప్పూరి మద్దిలేటి, సురేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments